విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి సినిమాతో బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సంబరాలను ఆ మధ్య విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తన ఫ్యాన్స్ కుటుంబాలకు కోటీ రూపాయలు పంచుతానని తెలిపిన సంగతి తెలిసిందే. తాను ఖుషి సినిమా విజయంతో సంతోషంగా ఉన్నానని.. ఈ ఖుషిని కొంతమందికి అయిన పంచాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు.
అయితే పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే ఆ అమ్మాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే విజయ్ దేవరకొండ ఆ అమ్మాయిని ఏమి అనవద్దని పోలీసులకు సర్ది చెప్పారు. ఆ లేడీ ఫ్యాన్‌తో మాట్లాడి ఫొటోలు కూడా దిగారు. తమ అభిమాన హీరోతో కలిసి ఫొటో దిగిన ఆ అమ్మాయి ఆనందానికి అవధుల్లేవు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శనానంతరం ఆలయ పరిసరాల్లో మీడియాతో మాట్లాడారు విజయ్ దేవరకొండ. ఈ ఏడాది తమ ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందన్నారు రౌడీ బాయ్.
‘ మా బ్రదర్ ‘(ఆనంద్ దేవరకొండ) బేబీ సినిమా, నేను నటించిన ఖుషి రెండూ విజయవంతమయ్యాయి. అందుకే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చాను. మా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రీశుడిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉంది. పునర్మిర్మాణంలో యాదాద్రి టెంపుల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతులు. మాలాగే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అని విజయ్ దేవరకొండ తెలిపారు.