విజయ్ ఆంటోనీ కూతురు గురించి చెప్తూ ఏడ్చేసిన సుమ, చివరి ఫోన్ కాల్ ఎవరికి..?

విజయ్ ఆంటోని కూతురు మీరా సూసైడ్ నేపథ్యంలో చెన్నై పోలీసులు కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి సూసైడ్ చేసుకొన్న గదిని తనిఖీలు చేశారు. ఆమె నుంచి చివరి ఫోన్ కాల్ ఎవరికి వెళ్లింది? చివరి మెసేజ్ ఎవరికి వెళ్లింది? ఎవరి నుంచి వచ్చిందనే కోణంలో ఫొరెన్సిక్ నిపుణులు విచారిస్తున్నారు. అయితే గతంలో సూసైడ్ థాట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు విజయ్ ఆంటోనీ.

అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయ్ అనేదానిపై మాట్లాడాడు. ఎవరినైనా ఎక్కువగా నమ్మి మోసపోయినప్పుడు, చెప్పినట్టుగా, కమిట్మెంట్ ఇచ్చినట్టుగా పని చేయలేకపోయినప్పుడు.. చిన్నపిల్లలకు అయితే చదువు విషయం వల్ల వచ్చే ఒత్తిడితో సూసైడ్ థాట్స్ వస్తాయని విజయ్ ఆంటోని అన్నారు. అంతే కాదు పిల్లలకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలని..

వారిపై ప్రెజర్ పెట్టవద్దని..ముఖ్యంగా స్కూల్ నుంచి వచ్చాక పిల్లలను చాలా కూల్ గా డీల్ చేయాలి.. అంతే కాని.. ట్యూషన్‌కి పో అక్కడికి ఇక్కడికిపో.. అని అంటుంటారు.. కాని వాళ్లని సొంతంగా ఆలోచించే టైమ్ ఇవ్వడంలేదు. మన చుట్టు పక్కల వాళ్ల వల్లే మనం కూడా అలా చేస్తున్నాం.. పిల్లలను కాస్త ఫ్రీగా వదిలేయాలి.. సొంతంగా ఆలోచించుకోనివ్వాలి అంటూ విజయ్ ఆంటోని చేసిన కామెంట్స్.. దానికి సబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *