విడదల రజిని..ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే గుంటూరులో పరిస్థితులు కంట్రోల్‌లో ఉన్నాయన్నారు మంత్రి విడదల రజిని. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. శారదాకాలనీలో వాంతులు, విరేచనాలతో మరణించిన పద్మ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి… ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల అర్ధిక సహాయం అందజేశారు.
ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మేరకు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశామన్నారు.