వేణు స్వామి చెప్పే మాటలన్నీ కూడా నిజం కావడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య కూడా అధికమవుతుంది.ఇదివరకు పలువురు సినీ సెలబ్రిటీల గురించి అలాగే రాజకీయ నాయకుల గురించి వేణు స్వామి చెప్పిన మాటలు అక్షరాల నిజం అయ్యాయి. అయితే పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో తాజాగా మూడేళ్ల కిందట ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతకం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆస్ట్రాలజర్ వేణు స్వామి జోస్యం అక్షరాల నిజమైందని పాత వీడియోను అందరూ ప్రస్తావిస్తున్నారు. బాబు జాతకం ఇలా..ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ చంద్రబాబు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..
‘చంద్రబాబు కచ్చితంగా సమస్యల బారిన పడతారు. వందకు వందశాతం ఆయన సమస్యల బారిన పడతారు. చంద్రబాబుకు 2024 వరకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. 2024లో చంద్రబాబు గెలవటం కష్టం. ఏ రెమిడీ తీసుకున్నా.. సబ్జెక్ట్ చెయ్యి దాటి పోయింది’ అని అన్నారు. వేణుస్వామి అప్పుడు అన్న మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు.