నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటారంటూ బాంబు పేల్చాడు. తీరా చూస్తే వేణు స్వామి చెప్పినట్లుగానే జరగడంతో ఆయన వీడియోలకు వ్యూస్ మిలియన్లు దాటాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ లు తన కోసం క్యూ కట్టే రేంజ్ కు ఎదిగిపోయారు. ప్రముఖ హీరోయిన్లు అనుష్క, రకుల్, రష్మిక మందన్నలకు వివాహం అచ్చిరాదంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇక అందరి జ్యోతిష్యాలు చెప్పే వేణు స్వామి నీ జాతకం ముందు చూసుకో అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అయితే చివరికి వేణు స్వామి చెప్పిందే నిజం అయింది.
అలాగే నిహారిక పెళ్లి విషయంలోనూ ఆయన ఎన్నో సందేహాలు వ్యక్తం చేయగా చివరకు అవే నిజం అయ్యాయి. ఇక వేణు స్వామి చెప్పే జ్యోతిష్యాన్ని ఆయన పూజలు కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నమ్ముతున్నారు. ఇప్పటికే డింపుల్ హయతి – నిధి అగర్వాల్ – రష్మిక లాంటి హీరోయిన్లు వేణుస్వామితో పూజలు కూడా చేయించుకున్నారు. వేణు స్వామి కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ లో యంగ్ హీరో చనిపోతాడని చెప్పడంతో అందరూ ఆయనపై విమర్శలు చేశారు. ఆయన ఆ మాట చెప్పిన కొద్దిరోజులకే తారకరత్న అకాల మరణం చెందారు.
ఇక ఇప్పుడు వేణు స్వామి మరో షాకింగ్ న్యూస్ బయట పెట్టారు. 40 సంవత్సరాల వయసు ఉన్న ఒక టాలీవుడ్ హీరోయిన్ త్వరలోనే చనిపోతుందని చెప్పారు. వేణు స్వామి ఒక్కసారిగా ఈ మాట చెప్పడంతో ఆయన ఏ హీరోయిన్ ను ఉద్దేశించి చెప్పారు. ఇటీవల ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్లు ఎవరు ? అంటూ ఎవరికి తోచినట్టుగా వారు రకరకాల హీరోయిన్ల పేర్లు పెడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఈసారి వేణు స్వామి జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.