అల్లు అర్జున్ విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం ఇదే.

సినీ సెలబ్రిటీస్.. రాజకీయ నాయకుల పై జాతకాలు చెప్పే వేణు స్వామి ఇటీవల అల్లు అర్జున్ జాతకం కూడా చెప్పాడు. ఆయన చెప్పిన జాత‌కం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. అయితే ఇక ఈ మధ్యనే యంగ్ హిరోయిన్ డింపుల్ హయాతి కూడా వేణు స్వామి వద్ద పూజ చేసుకున్న వీడియో, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్న సమయంలో వీరిద్దరూ జాతకాలు కలవలేదని, వీరు కొద్ది కాలానికే విడిపోతారని వేణు స్వామి చెప్పారు.

కానీ అప్పట్లో ఆయన మాటలు ఎవరు పట్టించుకోలేదు. అయితే కొన్నాళ్లకు అదే నిజమైంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన ఆయన గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతకం గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మాత్రమే.ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకుంటారు. అల్లు అర్జున్ ద్వారా నిర్మాతలు భారీ లాభాలను రాబట్టుకుంటారు.

అల్లు అర్జున్ జాతకంకు తిరుగులేదు. నిర్మాతలు కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. అల్లు అర్జున్ కు ఇంకో పదేళ్లు తిరుగులేదు. ఆయన సినిమాకు మినిమం 200 కోట్లు వస్తాయి. అయితే వేణు స్వామి చెప్పింది నిజమే అయింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మొన్ననే అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. దీంతో వేణు స్వామి చెప్పింది నిజమే అని అభిమానులు సోషల్ మీడియాలో ఆయన చేసిన మాటలు వైరల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *