వేణుమాధవ్ కామిడి టైమింగ్ స్టైల్ వేరైటీ గా వుంటుంది అది కొద్దిమందిలో మాత్రమే వుంటుంది. తోలి ప్రేమ, సై, ఛత్రపతి, లక్ష్మి వంటి మొదలగు సినిమాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. 1996లో ‘సాంప్రదాయం’ సినిమా ద్వారా నటుడిగా పరిచయమ్యారు. ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’, ‘సుస్వాగతం’, ‘తమ్ముడు’ సినిమాలతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
‘హంగామా’ సినిమా ద్వారా ఆయన హీరోగా కూడా మారారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకున్న వేణు మాధవ్ కొన్ని కారణాల వల్ల ఆ కోరికను నెరవేర్చుకోలేకపోయారు. వేణు మాధవ్ మృతికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా ఆయన కుటుంబ సభ్యులు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డెంగ్యూ ఫీవర్ వల్ల వేణు మాధవ్ మృతి చెందాడని తెలిపారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వేణు మాధవ్ ప్రాణాలు కోల్పోయారని ఆయన భార్య, కొడుకులు వెల్లడించారు.
వేణు మాధవ్ చనిపోవడానికి మూడు నెలల ముందు ఆయన బ్రదర్ మరణించాడని బ్రదర్ చనిపోవడం వల్ల వేణు మాధవ్ డిప్రెషన్ కు గురయ్యాడని వేణు మాధవ్ భార్య శ్రీవాణి వెల్లడించారు. వేణు మాధవ్ కొడుకులు మాట్లాడుతూ నాన్నగారికి మద్యం అలవాటు ఉందని అయితే ఆయన మరణానికి మద్యం కారణం కాదని అన్నారు. డెంగ్యూ ఫీవర్ కు చికిత్స చేయించుకోకపోవడంతో ఊపిరితిత్తులు చెడిపోయి నాన్న మృతి చెందారని వేణు మాధవ్ కొడుకులు వెల్లడించారు.