శ్రీవారిని దర్శించుకున్న వెంకటేష్‌ కూతురు, అల్లుడు.. ఎంత సింపుల్‌గా ఉన్నారో..!

వెంకీ మామ తన కూతురు హవ్యవాహినిని విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు తనయుడు డాక్టర్ నిషాంత్కి ఇచ్చి పెళ్లి చేసారు. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా పెద్దగా బయటకు రాలేదు. కేవలం ఒకటిరెండు పిక్స్ మాత్రమే నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే గతంలో తన పెద్ద కూతురు వివాహం చేసిన వెంకటేష్‌.. ఇటీవల రెండో కూతురు హయ వాహిని వివాహం నిర్వహించారు.

విజయవాడకి చెందిన డాక్టర్‌ నిశాంత్‌ పాతూరితో ఆమె మ్యారేజ్‌ జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మ్యారేజ్‌ చేసినట్టు సమాచారం. ఈ మేరకు అధికారికంగా కొత్త జంట ఫోటోలు విడుదల చేశారు. అవి వైరల్‌ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ కొత్త తిరుమల శ్రీవారిని సందర్శించుకుంటుంది. కొత్తగా పెళ్లైన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆశిస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరి వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

అయితే ఆమె వెంకీ కూతురు అని తెలియకపోవడంతో చాలా సింపుల్‌గానే అక్కడిగా నుంచి పోయారు. వెంకటేష్‌కి ముగ్గురు కూతురుళ్లు, ఒక కుమారుడు అర్జున్‌ ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు అవగా, మరో అమ్మాయి ఉంది. వెంకటేష్‌ ఈ సంక్రాంతి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఆయన సైంధవ్‌ చిత్రంలో నటించారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ పరాజయం చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *