ఘనంగా వెంకటేశ్‌ రెండో కుమార్తె ఎంగేజ్​మెంట్, అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మహేష్.

హీరో వెంకటేష్‌ రెండు కూతురు హవ్య వాహిని ఎంగేజ్‌మెంట్‌ బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఓ ప్రముఖ డాక్టర్‌ కుటుంబంతో వెంకీ కూతురి నిశ్చితార్థం నిర్వహించారు. ఈ వేడుకకి అతికొద్ది మంది సినిమా సెలబ్రిటీలు, ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొనడం విశేషం. అయితే చాలా సైలెంట్‌గా ఈ ఎంగేజ్‌మెంట్‌ని నిర్వహించడం గమనార్హం. అయితే టాలీవుడ్‌ సీనియర్ హీరో వెంకటేశ్‌ సెకండ్ ఇన్నింగ్స్​లో దూసుకెళ్తున్నాడు. ఓవైపు ఎఫ్2 లాంటి కమర్షియల్ సినిమాలు చేస్తూ.. మరోవైపు సైంధవ్ లాంటి సీరియస్ సినిమాలకు జై కొడుతున్నాడు.

ఇంకోవైపు రానా నాయుడు వంటి వెబ్ సిరీస్​తో డిజిటల్ వరల్డ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక వెంకీ పర్సనల్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఓ సీనియర్ హీరో కూతురి పెళ్లి వేడుక అంటే ఎంత ధూంధాంగా జరుగుతుంది.. ఎంత హడావుడిగా జరుగుతుందో తెలిసిందే. కానీ వెంకీ మాత్రం ఈ థాంజాంకు ఎప్పుడూ దూరంగా ఉంటాడు. తాజాగా వెంకటేశ్ రెండో కుమార్తె హయ వాహిని ఎంగేజ్మెంట్​ ఎలాంటి చడీచప్పుడు లేకుండా బుధవారం రోజున వైభవంగా జరిగింది.

విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడితో వెంకటేశ్ తన నివాసంలోనే ఈ వేడుక నిర్వహించాడు. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్య హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వెంకటేశ్‌, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయ వాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి 2019లో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *