వెంకటేష్ రెండో కూతురి పెళ్లికి ముహూర్తం ఫిక్స్, అబ్బాయి ఎవరో తెలిస్తే ఎగిరి గంత్తేస్తారు.

దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలుకానుంది. ఇప్పటికే వెంకటేష్ పెద్ద కూతురు పెళ్లి అయిన విషయం తెలిసిందే. అటు దగ్గుబాటి రానా మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వారింట మరో పెళ్లి వేడుక మొదలు కానుంది. అయితే వెంకటేష్ రెండో కూతురు హయవాహిని పెళ్లి చేసేందుకు దగ్గుబాటి వారు సిద్ధం అవుతున్నారట. వెంకీ మామకు మొత్తం నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. వీరిలో పెద్ద కూతురు ఆశ్రీత పెళ్లి చేసి చాలా కాలమైంది.

ఇప్పుడు వెంకీ మామ రెండో కూతురిని అత్తారింటికి పంపే సమయం దగ్గర పడిందట. మరి వరుడు ఎవరనే వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ ఫ్యామిలీ అబ్బాయికి భావన ఇచ్చి పెళ్లి చేయబోతున్నారని తెలుస్తోంది. కాగా.. వీరి ఎంగేజ్మెంట్ కూడా ఇదే నెలలో జరగనుందట. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కోసం దగ్గుబాటి ఫ్యామిలీ విజయవాడకు బయలుదేరి వెళ్లిందంట. ఈ ఎంగేజ్మెంట్ కి అక్కినేని కుటుంబం కూడా హాజరుకానుందని అంటున్నారు. అతి కొద్దిమంది సమక్షంలో ఈ వేడుక జరగనుందట.

ఇదిలా ఉండగా.. వెంకటేష్ ఎప్పుడూ తన ఫ్యామిలీని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతాడని తెలిసిందే. ఆయన కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉండరు. అసలు విషయం ఏంటంటే.. వెంకటేష్ ఫ్యామిలీ గురించి జనాలకు పెద్దగా తెలియదు అనంటే నమ్మాల్సిందే. జస్ట్ ఆయన భార్య నీరజ.. నలుగురు పిల్లలు ఉన్నారని మాత్రమే జనాలకు తెలుసు. పైగా తన ఫ్యామిలీ నుండి ఎవరిని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు వెంకీ మామ. ప్రస్తుతం రెండో కూతురి పెళ్లి పనులలో వెంకీ బిజీ ఉన్నాడట. రెండో కూతురు హయవాహిని అథ్లెట్ అని సమాచారం. మరి వెంకీ మామ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *