ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు వీరభద్రరావు చనిపోయారు. రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన ఆయన.. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. అయితే సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘వీరభద్రరావు’ ఈరోజు అనగా హైదరాబాద్‌లో కన్నుమూసారు.
అయితే వీరభద్రం గత రెండు నెలల క్రితం తన ఇంట్లో ప్రమాదవశాత్తూ కింద పడిపోయారు. అప్పుడు తీవ్ర గాయాలైన అతనిని కుటంబ సభ్యలు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఇలా రెండు నెలలుగా కోమాలోనే ఉన్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.దీంతో ఇటు బుల్లితెర నుంచి వెండితెర వరకు ఆయనతో కలిసి నటించిన చాలామంది నటులు షాక్ గురయ్యారు.
అలాగే ఆయన మరణంతో ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. ఇక టీవీ ప్రేక్షకులు బాగా సుపరిచితుడైన వీరభద్రరావు.. దాదాపు అనేక ఛానల్స్ లోని ప్రసారమైన సీరియల్స్ లో నటించారు. ఈ క్రమంలోనే వెండితెర పై ఎంట్రీ ఇచ్చిన ఆయన అనేక చిత్రాల్లో సైతం నటించారు. అయితే ఎన్నో సినిమాల్లో నటించిన వీరభద్రరావుకి చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. కానీ, చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి పాత్రల్లో కనిపించారు.
పైగా ఎక్కువ శాతం వీరభద్రరావు తండ్రి పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. ఇక ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, టీవీ రంగానికి చెందిన వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.