పెళ్ళికి ముందే శృంగారం చేస్తే వాళ్లు చెడ్డవాళ్లు, క్యారెక్టర్ లేదని అనుకుంటారు. ఇది కూడా ఎంజాయ్మెంట్లో ఒక భాగం మాత్రమే. కానీ ఇలా అర్థం చేసుకునే మెంటాలిటీ చాలా మందికి లేదు కదా..! శృంగారం అనగానే మనకు గుర్తుకువచ్చేది కండోమ్ అయితే దాని తర్వాత వయాగ్రా ఉంటుంది. కొంతమంది రతిలీ రెచ్చిపోవడానికి వయాగ్రా వాడుతుంటారు. వయగ్రా శృంగారానికి ఎలా పనిచేస్తుందో అంత కంటే ఎక్కువగా ఇతర సమస్యలకు కూడా పనిచేస్తుంది.
అయితే వయాగ్రా పిల్స్ … పురుషాంగం లోని రక్తనాళాలను రిలాక్స్ చేసి , రక్తం స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది. దీన్ని ఎప్పుడుపడితే అప్పుడు వేసుకోకూడదు. శృంగారంలో పాల్గొనాలని అనుకున్న సమయానికి గంట ముందుగా వేసుకోవాలి. అప్పుడే దాని పనితీరు బాగుంటుందని చెబుతున్నారు. దీన్ని ఆహారంలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు. కానీ ద్రాక్షరసంలో మాత్రం కలిపి తీసుకోకూడదు.
శృంగారం అయిపోయిన తర్వాత కూడా కొందరిలో వయాగ్రా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదని నిపుణుల పరిశోధనలో తేలింది. అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. రోజుకి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలని , అది కూడా 50 ఎంజికి మించరాదని సూచిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది కాకపోయినా కొద్దిమందిలో సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. ఇక గుండె జబ్బులు ఉండి కొన్ని రకాల మందులు తీసుకునే వారిలో మాత్రం ఇది ప్రమాదకరంగా పరిగణించవచ్చు.
అంతేకాదు.. సెక్స్ ప్రేరేపిత మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం చట్టపరంగా నేరం. సైడ్ ఎఫెక్ట్ గురించి ఆలోచిస్తే తలనొప్పి, మత్తుగా ఉండటం, చూపు అస్పష్టంగా మారడం, కొందరికి దృశ్యాలు నీలిరంగులో కనిపించవచ్చు. మొహం వేడెక్కడం, ఎర్రబారటం , ముక్కుదిబ్బడ, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ నొప్పి, పిట్స్రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మొహం, కనురెప్పలు వాయడం కూడా జరుగుతుంటాయి.