ప్రస్తుతం ట్రెండ్ మారింది. కొత్తగా చేయడానికి నేటి జంటలు ఉబలాటపడుతున్నాయట.. భారతీయులు శృంగారంలో కొత్తదనం కోరుకుంటున్నారని తాజాగా 17 ఏళ్లుగా సర్వే చేస్తున్న ఓ సంస్థ తాజాగా ఓ నివేదికలో బయటపెట్టింది. అయితే వయాగ్రా పేరు మీరందరూ వినే ఉంటారు. వయాగ్రా అనేది నీలిరంగులో, డైమండ్ ఆకారంలో ఉండే ఒక ఔషధం. ఇది ఒక ఉత్ప్రేరకం లాంటిది. ఫార్మసీలలో వయాగ్రా టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీనిని సెక్స్ టాబ్లెట్ అని కూడా పిలుస్తారు.
వయాగ్రాను మొదట్లో అధిక రక్తపోటు, ఆంజినా పెక్టోరిస్ చికిత్సకు ఉపయోగించడం జరిగేది. వయాగ్రాలో సిల్డెనాఫిల్ అనే సమ్మేళనం ఉంటుంది. రక్త ప్రసరణను పెంచడం ద్వారా జననేంద్రియ ప్రాంతంలో ఉత్తేజాన్ని పెంచుతుంది. సాధారణంగా వయాగ్రాను భోజనానికి అరగంట ముందు లేదా 2 గంటల తర్వాత తీసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తారు. దీని ప్రభావం దాదాపు 4-5 గంటల పాటు ఉంటుంది. వయాగ్రాను పురుషులు మాత్రమే ఉపయోగించాలి.
స్త్రీలకు అంగస్తంభన సమస్యలు ఉండవు, వారికి ఇది ఉపయోగం లేదు. వయాగ్రా తీసుకునేటప్పుడు నీళ్లు మాత్రమే తాగాలని సూచిస్తారు. మద్యం తాగినపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వయాగ్రా తీసుకోవద్దు. మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ ఔషధాన్ని వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. స్వంత వైద్యంతో దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది.