ఇప్పటికే వరుణ్ – లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు, మెగా ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కో ఫోటో షేర్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఫోటోల కోసం, వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోల కోసం, పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇక అది అలా ఉంటే..ఈ జంట పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ పెళ్లి కోసం నాగబాబు భారీగానే ఖర్చు చేశారని సమాచారం. లావణ్య త్రిపాఠి ధరించిన పెళ్లి చీర ఖరీదు ఏకంగా 10 లక్షల రూపాయలు అని సమాచారం.

నాగబాబు ఈ పెళ్లి వేడుకల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.పెళ్లికి సంబంధించి నాగబాబు ఏ విషయంలోనూ రాజీ పడలేదని సమాచారం. ఎక్కడ కూడా తగ్గకుండా కొడుకు పెళ్లి కోసం భారీగా ఖర్చ పెట్టారని తెలుస్తోంది. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.