వరుణ్ లావణ్య పెళ్లిలో ఉపాసన కి ఘోర అవమానం, అసలు ఏం జరిగిందో తెలుసా..?

వరుణ్ తేజ్, లావణ్య వివాహం లో మెగా హీరోలందరూ సందడి చేశారు. అల్లు అర్జున్ ఆయన సతీమణి పిల్లలు కూడా ఈవేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లిమ్ కారతో కనిపించారు. ఇక వరుణ్ వివాహం పూర్తి కావడంతో మెగా ఫ్యామిలీ ఇటలీ నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీ కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే పెళ్లికి వచ్చిన కొంత మంది అతిథులు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉపాసనకి కోపం తెప్పించారట.

అదేంటంటే అల్లు అయాన్ క్లింకారా తో కలిసి ఆడుకుంటున్నప్పుడు అలాగే ఆమెను ఆడిస్తున్నప్పుడు చాలామంది బంధువులు ఆ చిన్నపిల్లలను చూసి ఇప్పుడే కాబోయే భార్యను ఆడిస్తున్నాడు పెద్దయ్యాక వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి వీరి జంట చూడముచ్చటగా ఉంది అంటూ పెళ్లికి వచ్చిన కొంతమంది ఉపాసనతో అన్నారట. కానీ అలా అనడం ఉపాసన కు ఏమాత్రం నచ్చలేదట.అంతే కాదు ఇదే విషయంపై ఉపాసన తన అత్తగారు సురేఖతో మాట్లాడుతూ చిన్నపిల్లవాళ్లను చూసి ఇప్పటికే వారి జంట బాగుంది పెద్దయ్యక వీరిద్దరికి పెళ్లి చేయాలి అని మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరివి ఇప్పుడు పసి మనసులు.

కానీ వారు పెద్దయ్యాక ఎవరి మనసు ఎలా ఉంటుందో మనం ఊహించలేం.అలాంటిది ఇప్పుడే వారి పెళ్లి పెద్దయ్యాక చేసేయండి అంటూ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇలా మాట్లాడడం ఏం బాలేదు అత్తయ్య అని ఉపాసన చాలా బాధపడుతూ సురేఖ కి చెప్పిందట.కానీ ఉపాసన మాటలకు సురేఖ బంధువులు అన్నాక అలాగే అంటారు వారి మాటలు పట్టించుకోవద్దు అని సర్ది చెప్పినప్పటికీ ఉపాసన మాత్రం ఆ విషయాన్ని తలుచుకొని పెళ్లి లో కాస్త డల్ గా ఉందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *