వరుణ్ లావణ్య మధ్య ఏజ్ గ్యాప్ తక్కువే కాగా మిస్టర్, అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ సినిమాల్లో వరుణ్ లావణ్య కలిసి నటించారు. ఈ రెండు సినిమాలలో వరుణ్ లావణ్య జోడీకి మంచి పేరు వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమాలు ఆశించిన సక్సెస్ సాధించలేదు. #varunlav అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్ లో నిలుస్తుండటం గమనార్హం.
వరుణ్ లావణ్య ఒకరికోసం మరొకరు పుట్టారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక అది అలా ఉంటే..ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్ విషయం గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లావణ్య, వరుణ్ మధ్య కేవలం 11 నెలల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. వికీపిడియా ప్రకారం వరుణ్ తేజ్ జనవరి 19 1990లో జన్మించాడు. లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15, 1990లో జన్మించింది.
దీంతో వీరి మధ్య కేవలం 11 నెలల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌ను జరుపుకున్నారు. అందులో భాగంగా వరుణ్, లావణ్యలు తమకు ఇష్టమైన దేశం ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ జంట పెళ్లి జరిగింది. నవంబర్ 1న ఈ స్టార్ కపుల్ వివాహా బంధంతో ఒకటి అయ్యారు. ఇటలీ, టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఈ పెళ్లి జరిగింది.