ఆ సమయంలో చనిపోదామనుకున్న, జబర్దస్త్ వర్ష కన్నీటి కష్టాలు.

వ‌ర్ష ఇమాన్యుయేల్ మ‌ధ్య లవ్ ట్రాక్ అంటూ ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు సీరియ‌ల్స్ లో కూడా వ‌ర్ష న‌టించింది. అభిషేకం, తూర్పు ప‌డ‌మ‌ర‌, ప్రేమఎంత మ‌దురం సీరియ‌ల్స్ లో న‌టించింది. మాస్ భాష‌లో మాట్లాడుతూ ప్ర‌స్తుతం కుర్రాళ్ల మ‌న‌సు దోచేస్తుంది. దాంతో వ‌ర్ష‌కు ఎంతో మంది అభిమానులు కూడా అయ్యారు. ఇక ముందు ముందు ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.

వ‌ర్ష.. ఇక నా లైఫ్ కి సంబంధించిన కొన్ని కీలక విషయాలు అక్కడే మీతో పంచుకుంటాను అని పరోక్షంగా బిగ్ బాస్ షో గురించి హింట్ ఇచ్చింది ఈ జబర్దస్త్ చిన్నది. ఇదే సమయంలో తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గురించి కీలక వ్యాఖ్యలు చేసింది వర్ష. ” నాకు నాన్న అంటే చాలా ఇష్టం, ఆయన లేని లోటు ను ఎవరు తీర్చలేరు. ఆ తర్వాత నాకు మా అన్నయ్య అంటే ప్రాణం. రెండేళ్ల క్రితం నేను సంక్రాంతికి ఊరికి వెళ్ళాను. అప్పుడు అమ్మ ఫోన్ చేసి మా చిన్న అన్నయ్యకు యాక్సిడెంట్ అయింది త్వరగా రా అని చెప్పింది. అది చిన్న యాక్సిడెంట్ ఏమో అనుకున్నాను కానీ మా అన్నయ్యను స్కూటీ తో గుద్దారు.

తీరా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది, తన బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టుకుందని, బ్రతకటం కష్టమని చెప్పారు. ఎంత ఖర్చైనా సరే బ్రతికించమని డాక్టర్స్ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాను. ఆ సమయంలో మా అన్నయ్య పరిస్థితి ఏమిటో నాకు మాత్రమే తెలుసు, రెండు మూడు రోజులు బయట వాష్ రూమ్ బయటే పడుకునే దానిని, ఒక సమయంలో అన్నయ్య మెదడులో రక్తం లీక్ అవుతుందని, బ్రతకటం కష్టమని చెప్పటంతో తట్టుకోలేకపోయాను, ఆ సమయంలో నేను చనిపోవాలని అనుకున్న సృహ తప్పి పడిపోవడంతో నాకు ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అన్నయ్యకు ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరి పిలుచుకున్న అంటూ ఆనాటి సంఘటనలకు గుర్తుచేసుకుంది వర్ష.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *