గత బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న హాటెస్ట్ సెలెబ్రిటీలలో ఇనయ ఒకరు. గ్లామర్ గా కనిపిస్తూనే బిగ్ బాస్ హౌస్ లో వివాదాలతో రచ్చ కూడా చేసింది. ప్రస్తుతం ఇనయ బిగ్ బాస్ లో దక్కిన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే రామ్‌గోపాలవర్మ కడుపులో వోడ్కా పడితే తనే చేస్తాడో తనకే తెలియదు. ఏం కూస్తాడో, ట్విట్టర్‌లో ఏం రాస్తాడో, సినిమా ఏం తీస్తాడో అసలే తెలియదు.
అంతేనా..? పెగ్గు ఎక్కువైతే ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తాడో కూడా కొన్ని వీడియోలు చూశాం. తాజాగా ఆర్జీవీ ఓ బిగ్‌బాస్ లేడీ కంటెస్టెంట్‌కు వోట్లు వేయాలంటూ ఓ బహిరంగ అప్పీల్ చేయడం అందరినీ ఆశ్చర్యపర్చింది. దీని వెనుక కారణం ఏటబ్బా అన్న చర్చ మొదలైంది. కాంట్రవర్సీ దర్శకుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా.. అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది రామ్‌గోపాల్‌వర్మ. తెలుగు దర్శకుడైన ఆర్జీవీ తన టాలెంట్‌తో టాలీవుడ్‌లో మంచి సినిమాలు తీశారు. ఆయన టాలెంట్‌తో బాలివుడ్ ఆఫర్లు ఆర్జీవీని వెతుక్కుంటూ వచ్చాయి.
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సూపర్‌హిట్ సినిమాలు తెరకెక్కించారు. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లె చ్చుకున్నారు. అయితే ఆయన పేరు చాలాకాలం నిలవలేదు. కాదు నిలబెట్టుకోలేదు. సినిమాలు తీయకపోయినా మంచి సినిమాలు తీసినవారికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంటుంది. కానీ ఆర్జీవీ కాంట్రవర్సీ సినిమాలతో ఇటు అభిమాలనుల్లో అను ఇండస్ట్రీలో చులకనవుతున్నారు.