వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. వివాదాలు, గాసిప్స్‌కు చాలా దూరం. ఇన్నాళ్ల పాటు పెళ్లి ఆలోచన కూడా చేయలేదు. కాకపోతే.. అప్పట్లో వరలక్ష్మీ శరత్ కుమార్ లవ్ స్టోరీ, పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే ముందు నుంచి ఎలాంటి సమాచారం లేదు రూమర్ లేదు. సైలెంట్‌గా వరలక్ష్మి నిశ్చితార్థం చేసుకోవడం అందరిని సర్‌ప్రైజ్ చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోబోయే వరుడి గురించి ఫ్యాన్స్, నెటిజన్లు ఆరా తీయగా షాకింగ్ విషయం బయటపడింది.
ఆమె పెళ్లి చేసుకోబోయే నికోలాయ్ సచ్‌దేవ్‌కు ఇదివరకు పెళ్లై ఓ కూతురు కూడా ఉందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో అంతా వరలక్ష్మి కాబోయే భర్త గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం.. నికోలయ్ సచ్‌దేవ్‌కు గతంలో కవిత అనే ఓ మోడల్‌ని పెళ్లి చేసుకున్నాడట. వీరికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. నికోలయ్ సచ్‌దేవ్ కూతురు కష సచ్‌దేవ్ పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ వైడ్ పతకాలు కూడా సాధించింది. భార్యతో విబేధాల వలన విడాకులు అయ్యినట్లు సమాచారం.
దాంతో కొన్నేళ్ల క్రితమే నికొలయ్ భార్య కవితతో విడిపోయాడని, ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్‌తో ప్రేమలో పడి ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. నికోలయ్ సచ్‌దేవ్ భార్య కవితత 2010లో మిసెస్ గ్లాడ్‌రాగ్స్‌గా గుర్తింపు పొంది, కాలిఫోర్నియాలో జరిగిన మిస్ గ్లోబ్ 2011 పోటీలో పాల్గొన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ రంగంలో కొనసాగుతోంది. ఇక నికోలయ్ సచ్‌దేవ్‌కు ఆల్రెడీ పెళ్లైందని తెలిసి అంతా అవాక్కవుతున్నారు. వరలక్ష్మి ఓ స్టార్ నటి, స్టార్ నటుడు కూతురు. అలాంటి ఆమె రెండో పెళ్లివాడిని చేసుకోవాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి.