కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం, తిన్న వెంటనే పడుకోవడం, ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం, ఉప్పు, కారం, మసాలాలు అధికరంగా ఉంటున్నాయి. పీచు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వంటి వాటి వల్ల ఎసిడిటీ కి దారితీస్తున్నాయి. అయితే అయితే అలా టాబ్లెట్లు అలవాటు చేసుకోవడం కంటే నాచురల్ గానే ఇంటి చిట్కాల తో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
అది ఎలానో ఇప్పుడు చూద్దాం .. 50 గ్రాముల దానిమ్మ గింజలను అంతేకాకుండా 50 గ్రాముల పుదీనా ఆకుల పొడిని మరియు వాము ఒక 100 గ్రాములు, నల్ల ఉప్పు 50 గ్రాములు కలిపి ఆ మిశ్రమాన్ని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత ఒక చెంచా తినాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా ప్రతి రోజు చేస్తే కడుపు నొప్పి, గ్యాస్ సంబంధిత సమస్యలు, అజీర్తి తగ్గిపోతాయి.
అంతే కాకుండా ప్రతి రోజూ నాలుగు లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి. స్పైసి ఫుడ్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా స్నాక్స్ ను అసలు తినకూడదు. మద్యానికి కూడా దూరంగా ఉండాలి. అంతేకాకుండా గ్యాస్టిక్ సమస్యతో బాధపడేవారు బంగాళదుంప, చిక్కుడు గింజలు ,టీ ,కాఫీలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ నియమాలు పాటిస్తే గ్యాస్ట్రిక్ సమస్య నుండి విముక్తి లభిస్తుంది.