ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి ప్రధాన కారణం ఆమె రీసెంట్గా నటించిన బేబీ సినిమా రిలీజ్ కావడమే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది. అయితే హైదరాబాద్ లోని పాతబస్తీలో పుట్టి పెరిగిన వైష్ణవికి డ్యాన్స్ అంటే తెగ ఇష్టమట. కూచిపూడి డ్యాన్స్ లో వైష్ణవి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంది.
కూచిపూడి డ్యాన్స్ ఫామ్ లో వైష్ణవి కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఉందట. అంతే కాకుండా 2014వ సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన డ్యాన్స్ పోటీలలో వైష్ణవి చైతన్య కి నెంబర్ 1 స్థానం లో నిలిచిందట. అలా వచ్చిన ఫేమ్ తో ఆమెకు మెల్లగా షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు, సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయట.
“హీరోయిన్ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చా. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్‌గానే ఉండిపోతానేమో అనుకునేదాన్ని. ఆ దశలో సాయిరాజేశ్ ఈ కథ చెప్పినప్పుడు షాక్‌కి గురయ్యా. ఈ పాత్రని నేను చేయగలనా? అనే సందేహం కూడా వచ్చింది. కానీ దర్శకుడే నన్ను నమ్మి, చేయగలవంటూ ధైర్యం చెప్పారు’’. అని బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్ గురించి చెప్పుకొచ్చింది వైష్ణవి.