ఏడ్చేసింది పాపం, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి చైతన్య.

తాజాగా బేబీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిత్రయూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయి స్టేజిపైనే ఏడ్చేసింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. బేబీ ఒక రియాలిటీ స్టోరీ. మన చుట్టూ ఉండే కథల్లోంచి తీసుకున్న స్టోరీ. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

క్యారెక్టర్ అరుస్ట్ లుగా కొంతమంది హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ అమ్మడే వైష్ణవి చైతన్య. ఈ బ్యూటీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు లు చేసిన విషయం తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ రీల్స్, టిక్ టాక్ వీడియోస్, యూట్యూబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయ్యింది ఈ చిన్నది. ఈ అమ్మడు నటించిన సాఫ్ట్ వేర్ డవలపర్స్ సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది.

ఇక ఇప్పుడు బేబీ అనే తో హీరోయిన్ గా మారింది. విజయ్ దేవర కొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ అందమైన ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది బేబీ. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ క్రమంలో బేబీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎమోషనల్ అయ్యింది. సాయి రాజేశ్ తనకు నటిగా పునర్జన్మనిచ్చారంటూ ఎమోషనల్ అయ్యింది ఈ చిన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *