పెళ్లి పై అసలు విషయం చెప్పిన హీరోయిన్ విష్ణవి చైతన్య. ఖచ్చితంగా..?

బేబీతో వైష్ణవి క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్ళింది. తాజాగా వైష్ణవి చైతన్య అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ‘వాట్సాప్ బేబీ’ పేరుతో వైష్ణవి వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో నెటిజెన్లు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఇన్ స్టా రీల్స్, టిక్ టాక్ వీడియోలతో, యూట్యూబ్ తో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీల్లో వైష్ణవి చైతన్య ఒకరు. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించింది వైష్ణవి చైతన్య. ఆతర్వాత పలు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన అలవైకుఠపురంలో సినిమాలో బన్నీ చెలెల్లిగా నటించి మెప్పించింది వైష్ణవి చైతన్య.

ఇక రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. బేబీ సినిమాతో వైష్ణవి పేరు మారుమ్రోగిపోయింది . సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఓటీటీలోకూడా ఈ సినిమా దుమ్మురేపుతోంది. దాంతో వైష్ణవి ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు ఈ చిన్నదానికి టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బలగం దర్శకుడు వేణు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తుందని తెలుస్తోంది. తాజాగా వైష్ణవి చైతన్య అభిమానులతో ముచ్చటించింది. ‘వాట్సాప్‌ బేబీ’ పేరుతో వైష్ణవి చైతన్య వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోలో నెటిజన్స్ అడిగే ప్రశాలకు సమాధానం చెప్పింది వైష్ణవి. ఇందులో భాగంగా ఓ నెటిజన్ వీరాజ్ అశ్విన్ ఆనంద్ దేవరకొండ ఇద్దరిలో ఒకరినిపెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని ప్రశ్నించాడు. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోను అని తెలిపింది. కానీ ఈ ఇద్దరిలో ఒకొక్క క్వాలిటీ తనకు చాలా ఇష్టమని తెలిపింది. అలాగే బేబీ సినిమాలో వైష్ణవి చేసింది కరెక్టేనా అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం చెప్తూ.. మనం ఇలా చేయాలి. ఇలా చేయకూడదు అనే పరిమితులు పెట్టుకోకూడదు అని తెలిపింది వైష్ణవి చైతన్య. ఇప్పుడు ఈ చిట్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వైష్ణవికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ అమ్మడు బడా హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *