వైష్ణవి చైతన్య కెరీర్ పరంగా ఇలా అదృష్టం వరించినా.. ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా కష్టాలు ఉన్నాయట. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ సీక్రెట్స్ వెల్లడించింది వైష్ణవి. మొదట దబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలు చేసేది వైష్ణవి. ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ కూడా చేసింది. సిల్వర్ స్క్రీన్ పై పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. అలా అలా హీరోయిన్ గా మాత్రం తొలి ప్రయత్నమే సక్సెస్ చేసుకుంది. అయితే ఇదిలా ఉండగా డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ సినిమా చేసి హీరోయిన్గా ఎక్కడ లేని క్రేజ్ దక్కించుకుంది.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను పడ్డ కష్టాలను తెలిపింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. నేను పదవ తరగతి చదువుతున్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను తీసుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది కేవలం డాన్స్ మాత్రమే.. బర్తడే, పెళ్లి లాంటి ఈవెంట్స్ లో డాన్స్ చేసేదాన్ని.. ఎక్కువగా రాత్రులు బర్తడే పార్టీలు జరిగేవి వాటిలో డాన్స్ చేస్తే 700 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుతో మా అమ్మ బియ్యం కొనుక్కొని వచ్చేది. ఇక యూట్యూబ్ లో వీడియోలు చేయడానికి కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి ప్రత్యేక గది కూడా ఉండేది కాదు.
వాష్ రూమ్ కి వెళ్లి దుస్తులు మార్చుకునే దాన్ని . ఇక అదంతా చూసి అమ్మ ఏడుస్తూ ఎందుకమ్మా ఇదంతా వద్దు వదిలేయని బాధపడింది. అయినా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అయితే ఒకసారి ఒక సినిమాలో చిన్న పాత్ర చేశాను. మనకంటూ క్యారవాన్ ఉండదు కాబట్టి పెద్ద ఆర్టిస్ట్ దగ్గరకు వెళ్లి వాష్ రూమ్ కోసం మీ క్యారవాన్ వాడుకోవచ్చా అని అడిగితే ఆమె నానా మాటలు అన్నది. అప్పుడు ఏడుపు ఒక్కటే మిగిలింది ఈ సంఘటన నన్ను చాలా బాధ పెట్టింది. కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు అంటూ ఆమె తెలిపింది.