మనలో చాలా మందికి ఉమ్మెత్తలో రెండు రకాలు ఉంటాయని తెలియదు. ఉమ్మెత్తలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని రెండు రకాలు ఉంటాయి. తెల్ల ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడబడితే అక్కడకనబడుతూనే ఉంటుంది. కానీ నల్ల ఉమ్మెత్త చాలా తక్కువగా కనిపిస్తుంది. నల్ల ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా నల్ల ఉమ్మెత్తను ధన వృద్ధికి, నర దిష్టికి కూడా ఉపయోగిస్తారు. అయితే తలపై కురుపులతో ఇబ్బంది పడేవారు నల్ల ఉమ్మెత్తకు నలగగొట్టి ఆముదంతో నూరి ఉడకబెట్టి ఆ ముద్దను కురులపై లేపనం వేస్తె తల కురుపులు తగ్గిపోతాయి .
అరికాళ్ళ మంటలు తగ్గుటకు నలల ఉమ్మెత్తకు రసం , దొండాకు రసం, చిక్కుడాకు రసం సమంగా కలిపి అరికాళ్ళకు మర్దన చేస్తూ ఉంటే మంటలు తగ్గుతాయి. నలల ఉమ్మేత్తాకు నలగగొట్టి సమంగా ఆవు పేడతో కలిపి మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి ఉడకబెట్టి దానిని గోరువెచ్చగా గడ్డలపై వేసి కట్టు కడుతూ ఉంటే శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ గడ్డలు పగిలి మానిపోతాయి .\ *నల్ల ఉమ్మెత్త ఆకులను తీసుకొని శుభ్రపరుచుకోవాలి. ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. 100 గ్రాముల నల్ల ఉమ్మెత్త ఆకుల రసానికి 100 గ్రాముల నువ్వుల నూనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాసుకుంటే గజ్జి, తామర, దురద, అలర్జీ అన్నీ తగ్గుతాయి. అంతేకాదు పేను కొరుకుడుతో ఇబ్బందిపడేవారికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. నల్ల ఉమ్మెత్త ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని పారబోసి.. నల్ల ఉమ్మెత్త ఆకులు ఎండబెట్టలి. ఎండిన తర్వాత ఈ ఆకులను మజ్జిగ లో కలిపి తీసుకుంటే అనేక రకాల చర్మ సంబంధ సమస్యలను నివారిస్తుంది. అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న పురుషులకు నల్ల ఉమ్మెత్త చెట్ల వేర్లు దివ్య ఔషధమని చెప్పవచ్చు. ముందుగా చెట్టు వేర్లు ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి.
ఈ పొడిని గోమూత్రంలో కలిపి రాసుకుంటే అంగస్తంభన సమస్య తగ్గుతుంది. ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉన్న చోట రాసి కట్టు కడితే శరీరం లో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. స్త్రీల స్తనాల వాపులకు ఈ ఆకులపై నువ్వుల నూనె రాసి వేడి సెగ చూపించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి తగ్గుతాయి. *అంతేకాదు ఈ నువ్వుల నూనె రాసిన ఆకులను తల నొప్పి ఉన్న చోట ఉంచితే త్వరగా తగ్గుతుంది.