ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగాడు. హిట్టు మీద హిట్టు అందుకుంటూ.. నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. కెరీర్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలతో ఒక్కసారిగా అతడి క్రేజ్ పడిపోయింది. తాజాగా ఈయన రాసిన ఎమోషనల్ లెటర్ ఒకటి బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఉదయ్ కిరణ్ రాతలోనే.. ‘విషితా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో… ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు.
అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచి వాడు అని నమ్ముతున్నావు. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్‌గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను.
మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓ సారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా’ అని ఉంది. ఈ లేఖను చదివిన ఉదయ్ అభిమానులంతా ఆయనను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చదివిన ఉదయ్ అభిమానులంతా ఆయనను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఇది ఉదయ్ కిరణ్ రాసిన లేఖనేనా కాదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.