ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు.. ఆయన జ్ఞాపకాలు మాత్రం తెలుగు ప్రేక్షకుల మధిలో ఇంకా పదిలంగానే ఉన్నాయి. అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి బ్యాక్ టు బ్యాక్ విజయాలను సాధించి స్టార్ హీరోలను సైతం భయపెట్టాడు ఉదయ్ కిరణ్. అయితే నువ్వు నేను అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్నో మంచి సినిమాలు చేసి మెప్పించిన ఉదయ్ కిరణ్ లైఫ్ ఎలా టర్న్ అయ్యిందో అందరికి తెల్సిందే.
పెళ్లి తరువాత.. సినిమా అవకాశాలు లేక.. చాలా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. అయితే అసలు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు అసలు కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు అనే చెప్పాలి. ఇప్పటికీ ఆయన ఈ లోకంలో లేకపోయినా .. ఆయన సినిమాల ద్వారా ఎల్లప్పుడూ బతికేఉంటాడు. ఇప్పుడు ఉదయ కిరణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే.. ఆయన చెల్లి టాప్ సింగర్ గా కొనసాగుతుంది కాబట్టి. అవును ఉదయ కిరణ్ కు ఒక చెల్లి ఉంది.

సొంత చెల్లి కాదు కానీ, చిన్నమ్మ కూతురు.. పేరు పర్ణిక మాన్య. ఏంటిజీ తెలుగు సరేగమప లో పాల్గొన్న పర్ణికనా అంటే .. అవును ఆమెనే. పర్ణిక, ఉదయ్ కిరణ్ చిన్నతనం నుంచి చాలా క్లోజ్ గా ఉండేవారట. తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. “అన్న ఏ విషయాలను అయినా నా దగ్గర చెప్పేవాడు. అన్నయ్య ఎంతో మంచి మనసున్న వ్యక్తి. ఇంత చిన్న వయస్సులోనే మాకు దూరమవుతాడని మేము అనుకోలేదు. ఇండస్ట్రీలో నేను అన్నయ్య పేరును ఎప్పుడు వాడుకోవాలనుకోలేదు. అందుకే చెప్పలేదు..” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నెట్టింట పర్ణిక వాఖ్యలు వైరల్ గా మారాయి.