ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది.
పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది. అయితే స్త్రీలు సంతోషంగా ఉంటే, లక్ష్మీదేవి కూడా ఆ ఇంట కొలువై ఉంటుందని శాస్త్రాలు చెప్పడం జరిగింది. పొరపాటున కూడా, ఇలాంటి తప్పులు స్త్రీలు అసలు చేయకూడదు.
కొంతమంది స్త్రీలు ఉదయం పూట స్నానం చేయరు. మిగిలిన పనులను పూర్తి చేస్తూ ఉంటారు. అయితే, కొన్ని రకాల పనులను స్నానం చేయక ముందు చేస్తే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. డబ్బుని, సంపదని లక్ష్మీదేవిగా భావిస్తారు.