అసలు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే ఇంట్లో అసలు ఒప్పుకోరు సినీ ఇండస్ట్రీలో జరిగే పనులు చూసి హీరోయిన్గా తమ పిల్లలను పంపించడానికి తమ తల్లిదండ్రులు ఒప్పుకోరు. అయితే వాళ్ళని ఎదిరించి మరి కొందరి ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్లుగా తమ టాలెంట్ చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ అందం కోసం నానా రకాల తిప్పలు పడుతూ ఉంటారు.
అయితే ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా చేతినిండా అవకాశాలతో దూసుకుపోతూ ఇప్పటికి హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమె 40 యేళ్లు వచ్చినా కూడా వివాహం చేసుకోలేదు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో త్రిష అందానికి చాలామంది మంత్రముగ్ధులు అవుతున్నారు. సాధారణంగా 30 ఏళ్లు దాటడంతోనే ముడతలు పడిపోయి ఫేస్ మొత్తం అందవిహీనంగా అయిపోతుంది. అలాంటిది 40 ఏళ్లు దాటినా కూడా ఇంకా అందంగా కనిపించడానికి ప్రధాన కారణం ఆమె మెడికల్ ఇంజక్షన్స్ వేయించుకుంటోందట.

అవకాశాల కోసం తన అందాన్ని అలాగే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఇలా ఇంజక్షన్లు తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే 40 లో కూడా త్రిష ఇలా అందంగా ఉండడం చూసి నిజంగానే త్రిష ఇంజక్షన్స్ వేయించుకుంటుందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.