ఆ బోల్డ్‌ సీస్‌ చేసేటప్పుడు నాకు చాలా తృప్తిని ఇచ్చింది : త్రిప్తి డిమ్రి

త్రిప్తి యానిమల్ సినిమాకు 5 సినిమాల్లో కనిపించింది. వీటిల్లో ఏ ఒక్క సినిమా కూడా మంచిపేరు తీసుకురాలేదు. కానీ యానిమల్ లో కనిపించింది కొంచెంసేపే అయినప్పటికీ ఆడియన్స్ మొత్తం ఆమెగురించి మాట్లాడుకునేలా చేసింది. మెయిన్ లీడ్ రష్మికకు పోటీగా తృప్తి ఫర్మామెన్స్ ఉందనే టాక్ వచ్చింది. రణబీర్ తో రొమాన్స్ సీన్స్ లో తృప్తి యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది.

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్బీర్ కపూర్ అన్‌ బిలీవబుల్‌ యాక్టింగ్‌కు తోడు.. త్రిప్తి డిమ్రి నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమె లుక్సే.. కారణమో.. ఇంటెన్సివ్‌ యాక్టింగే స్కిల్సే కారణమో.. లేక బోల్డ్ సీన్సే కారణమో తెలీదు కానీ.. ఆఫ్టర్ యానిమల్ రిలీజ్‌.. సోషల్ మీడియాలో ఆమె ట్రెండ్‌ అవుతూ వస్తోంది. ఇక ఈక్రమంలోనే యానిమల్ సినిమాలోని బోల్డ్ సీన్స్‌ గురించి ఫస్ట్ టైం మాట్లాడింది.

ఇంతకీ త్రిప్తి ఆ బోల్డ్ సీన్స్‌ గురించి ఏం చెప్పారంటే! “ఆ రోజు సెట్‌లో నలుగురు మాత్రమే ఉన్నారు. నేను, రణబీర్, సందీప్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ప్రతి ఐదు నిమిషాలకు వారు నన్ను అడుగుతూ ఉన్నారు. మీరు బాగున్నారా? మీకు సౌకర్యవంతంగా ఉందా.? అని అడుగుతూనే ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఎంతగానో మద్దతు ఇస్తున్నప్పుడు, మీకు ఇబ్బందిగా అనిపించదు.” అంటూ ఆ సీన్స్‌ గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *