బంగారం ధరలు ఈ రోజు కూడా పడిపోయాయి. పసిడి రేటు పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. బంగారం ధరల తగ్గుదల వల్ల కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే బులియన్ మార్కెట్‌లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 తగ్గింది.
ఈ రెండు రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 450 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,350లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా వరుసగా రెండోరోజు తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 75,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏకంగా రూ. 2300 తగ్గింది. ఈ రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ. 3000 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 75,000గా ఉండగా.. చెన్నైలో రూ. 78,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,000 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,500ల వద్ద కొనసాగుతోంది.