ఆడపిల్లకు బంగారమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటుంటారు. అయితే కొద్దిరోజుల కిందటి వరకు గోల్డ్ రేటు రికార్డు స్థాయిలో ఉన్న నేపథ్యంలో పెద్దగా కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించట్లేదు. ఇప్పుడు వారికి పెద్ద ఊరట దక్కిందని చెప్పొచ్చు. రెండు రోజులుగా గోల్డ్ రేటు దిగొస్తుంది. అయితే ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.280 మేర ధర తగ్గింది.
వెండి కిలో ధర రూ.600 మేర తగ్గి.. రూ.74,200 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,600 గా ఉంది.ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.54,500, 24 క్యారెట్ల పసిడి రూ.59,450ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780 గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 ఉంది.
ఇక బెంగళూరులో 22 క్యారెట్ల రేటు రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,200 ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.74,200 లుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000, బెంగళూరులో రూ.73,000, కేరళలో రూ.77,000, కోల్‌కతాలో రూ.74,200 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,000 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.