దవ్యోల్బణం వ్యతిరేకంగా బంగారాన్ని కొన్ని ఏళ్లుగా పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. వన్‌ఇండియా గుడ్‌రిటర్న్స్ పా కుల ప్రయోజనాలు కోసం సమాచారంగా భారత్‌లో బంగారం ధరలను అందిస్తోంది. అయితే బంగారం ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి రేటు నేల చూపులు చూడటం వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్‌లపై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది . ఈ నెల ప్రారంభంలో పది గ్రాములకు రూ.60,380 వద్ద ఉన్న బంగారం.. క్రమం తగ్గుకుంటూ వస్తోంది. హైదరాబాద్‌లో ఈ రోజు ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,060గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050 గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల ధరపై రూ. 100 మేర బంగారం ధరలు తగ్గాయి. రాబోయే కాలంలో పెళ్లిళ్లు, పండుగల సీజన్ కావటంతో మరోసారి బంగారం ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇక దేశ రాజధానిలోనూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ ధర ఈరోజు 60,210గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,200 పలుకుతోంది. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గుకుంటూ వస్తున్నాయి. భాగ్యనగరంలో ఈరోజు వెండి ఏకంగా రూ. వెయ్యి తగ్గింది. రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ.1200 మేర తగ్గిపోయింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేటు రూ. వెయ్యి తగ్గి రూ. 77,300 పడిపోయింది. వెండి ధరసైతం బంగారంతో పాటు వరుసగా దిగివస్తుంది. దేశ రాజధానిలోనూ వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,100 ఉంది.