ప్రముఖ నటి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపీ విరామ సమయంలో సమంత స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. దర్శనానంతరం రంగా నాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేసారు.
తన వ్యక్తిగత సిబ్బందితో వచ్చిన సమంత… వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు సమంతకు వేదాశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలను స్వీకరించిన అనంతరం సమంత ఆలయం వెలుపలికి వచ్చారు. సమంత రాకతో ఆలయం పరిసరాల్లో కోలాహలం నెలకొంది.
సమంత ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించడం తెలిసిందే. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సమంత పర్యటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.