మంగళవారం ఉదయం షారుక్ ఖాన్, నయనతార, మరికొంతమంది చిత్రయూనిట్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. షారుక్ ఖాన్ తన జీవితంలో తిరుమలకు రావడం ఇదే తొలిసారి. సాంప్రదాయ దుస్తుల్లో సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అయితే నేడు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని షారుక్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ దర్శించుకున్నారు. వారితో పాటు హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుక్ ఖాన్‌కు స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయాన్ని కూడా ఈ మధ్యే షారుఖ్ దర్శించుకున్న విషయం తెలిసిందే..
తిరుమల ఆలయ సంప్రదాయ దుస్తుల్లో తెల్లటి పంచె, షర్ట్‌ను షారుఖ్ ధరించగా.. తన కూతురు సుహానా ఖాన్ కూడా తెల్లటి చుడీదార్‌లో మెరిశారు. అలాగే నటి నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు కూడా తెల్లటి దుస్తుల్లో ఉన్నారు.