తిరుమలలో ఎదురుపడ్డ బండ్ల గణేష్, మంత్రి రోజా, ఏం జరిగిందో చుడండి.

నైవేధ్య విరామ సమయంలో బండ్ల గణేష్‌ మిత్రులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం బండ్ల గణేష్‌కు వేద పండితులు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అయితే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

కూతురు, అల్లుడు, మనవడితో కలిసి బుధవారం కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నైవేద్య విరామ సమయంలో వీఐపీ దర్శనం ద్వారా మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాథస్వామి ఆలయంలో వేద పండితులు వారిని ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు.

మనవడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకే తిరుమల వచ్చామన్నారు. శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా లిలితా జూవెల్లర్స్ చైర్మన్ కిరణ్‌తో స్వామి వారిని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన దేశం పేరును భారత్‌గా మార్చడంపై బండ్ల స్పందించేందుకు నిరాకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *