హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివి మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేశారు. తర్వాత మహర్షి మూవీలో స్టూడెంట్ గా కనిపించారు. ఆ మూవీలో దివికి మహేష్ తో కూడా రెండు మూడు డైలాగ్స్ ఉండడం విశేషం. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్ర కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. దివి అనే ఓ హీరోయిన్ ఉందని బిగ్ బాస్ ద్వారానే తెలిసింది. సీజన్ 4 లో దివికి అవకాశం దక్కింది. దివి గ్లామర్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఇతర లేడీ కంటెస్టెంట్స్ మాదిరి ఆమె అఫైర్స్, స్కిన్ షోకి దూరంగా ఉన్నారు. అలాగే గేమ్ అంత అగ్రెసివ్ గా ఉండేది కాదు. అయితే తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ కథానాయకి దివి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…..ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల దివి మాట్లాడుతూ…. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ఇక పుష్ప-2 సినిమా కోసం అందరూ వేచి ఉన్నట్లే తాను వేచి ఉన్నానని అన్నారు. హరికథ అనే వెబ్ సిరీస్ చేస్తున్నానన్నారు. లంబసింగి సినిమా ఘన విజయం సాధించడంతో శ్రీవారి దర్శానికి వచ్చినట్లు తెలిపారు.
సినీ పరిశ్రమలో పోటీ ఎక్కువగానే ఉందని కష్టపడితే ఆఫర్స్ వస్తాయన్నారు. సినీ పరిశ్రమలోనే ఉండాలి… ఎదగాలి అంటే చాలా కష్టమని అన్నారు. లక్ తో పాటుగా దేవుని కృప ఉంటే సినిమాల్లో నిలదొక్కుకోగలమన్నారు.