ఢిల్లీ తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత జీవితం ఎలా ఉందొ తెలుసా..?

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ తర్వాత మూడో రాజకీయ నేత కవిత కావడం గమనార్హం. సిసోడియా జైలు నంబర్ 1 , సంజయ్ సింగ్​‌కు జైలు నంబర్ 2 ను కేటాయించారు. మరో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత సత్యేంద్ర కుమార్ ఏడో నంబర్ జైలులో ఉంచారు. ఇక, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఏప్రిల్ 9 వరకు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే తిహార్ జైలు నిబంధనల ప్రకారం కవితకు ఒక పరుపు, చెప్పులు, బట్టలు, బెడ్‌షీట్, దుప్పటి ఇచ్చారని తెలుస్తోంది.

దీంతో పాటు ఆమెకు మందులు కూడా అందించినట్లు సమాచారం. తనకు ఫలానా వస్తువులు కావాలని ఎలాంటి డిమాండ్ చేయలేదని పేర్కొన్నారు జైలు అధికారులు. కోర్టు ఆదేశాలు, జైలు నిబంధనల ప్రకారం ఆమెకు అవసరమైన వస్తువులను అందజేస్తామని ఒక అధికారి తెలిపారు. కోర్టు ఆదేశం ప్రకారం, కవితకు ఇంట్లో వండిన ఆహారం, ఒక పరుపు, చెప్పులు, బట్టలు, ఒక బెడ్‌షీట్, ఒక దుప్పటి, పుస్తకాలు, పెన్, కాగితం, మందులు అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు.

పైన పేర్కొన్న వాటికి మాత్రమే కోర్టు అనుమతి ఉందని స్పష్టం చేశారు. కవిత జైలులోకి వెళ్లేటప్పుడు ఎలాంటి ఆభరణాలు ధరించడానికి అనుమతి ఉండదు. ఈ క్రమంలోనే ఆమె జైలుకు వచ్చినప్పుడు ఎలాంటి నగలు తన దేహంపై ధరించలేదని అధికారి తెలిపారు. కవిత ఉన్న తీహార్ జైలులో లైబ్రరీ ఉంది. అందులో పుస్తకాలను చదివేందుకు అనుమతి ఉంటుంది. తీహార్ జైలు కాంప్లెక్స్‌లోని ఆరో నంబర్ జైలులో దాదాపు 500 మంది మహిళా ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న రాజకీయ నాయకుల్లో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కవిత ఉన్నారు. సిసోడియా జైలు నంబర్ 1లో ఉండగా, సింగ్ జైలు నంబర్ 2లో ఉన్నారు. ఇదే మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన మరో నేత సత్యేందర్ జైన్ జైలు నంబర్ 7లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *