పేరులో ఉన్నట్టుగానే అతిబల చెట్టు శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది. దీని ఆకుల రసాన్ని వారానికి రెండు, మూడు సార్లు సేవించడం వల్ల నీరసం, నిస్సత్తువ తగ్గి శరీరం ఆక్టివ్ స్టేజ్ లోకి వెళ్తుంది. అయితే అతిబాలా. ఇది ఒక కలుపు మొక్క. వేడి ప్రాంతాల్లో ఎక్కువగా ఆ కలుపు మొక్క పెరుగుతుంది. ఆకులు గుండె ఆకారంలో, పసుపు పూలతో ఎత్తుగా ఉంటుంది. మాల్వేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్కను సంప్రదాయ వైద్య విధానం లో ఉపయోగిస్తారు. ఈ మొక్కలు వేర్లు, ఆకులు , పువ్వులు, బెరడు, విత్తనాలు , కాండం వంటి వివిధ భాగాలు అన్నీ ఉపయోగించబడతాయి. ఈ మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ హైపెర్లిపిడెమిక్, మలేరియా నిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ అతిబలాను కొన్ని ప్రాంతాల్లో ఊరం, ముద్రగడ, దువ్వెన బెండ, తురబే,, ఉరుమ్, తుత్తురు బెండ, దువ్వెన కాయ లు అని కూడా అంటారు. అయితే ఈ మొక్కతో మగవారి లో ఉండే శీఘ్ర స్కలనం సమస్యను తొలగించొచ్చట. అంతేకాందు శ్వాస సంబంధ సమస్యలూతొలగించుకోవచ్చంట. దగ్గు నుంచి ఉపశమనం..దువ్వెన కాయలు ఆకులు మృదువుగా జిగటగా ఉంటాయి. శరీరంలోని మలినాలను బయటకు పంపి శుద్ధి చేస్తుంది. జ్వరం తో బాధపడేవారు దువ్వెన కాయలు ఆకులను నీటిలో నానబెట్టి వడపోసి అందులొ కొద్దిగా కండ చెక్కర కలిపి కొద్ది కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.
ఇదే నీరు మూడు పూటలా తాగితే మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయం వాపు , దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. శీఘ్ర స్కలనం సమస్యకు చెక్.. ఈ చెట్టు మొత్తాన్ని కాల్చి బూడిద చేసి రెండు రెట్ల నీళ్లలో నానబెట్టి మూడు రోజుల పాటు అలా ఉంచాలి. రోజు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. మూడవ రోజు పైన తేలిన నీటిని మాత్రమే తీసుకొని ఎగిరిపోయే అంతవరకు మరిగించాలి. గిన్నెలో మిగిలిన బూడిద ను మెత్తగా నూరి దీనిని రోజు అరచెంచా మోతాదులో తీసుకుంటూ ఉంటే శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. శీఘ్ర స్కలనం సమస్య ఉన్నవారు 100 గ్రాముల ఆకుల పొడి 100 గ్రాముల పట్టిక శతావరి పొడి 100 గ్రాములు మొత్తం మిక్స్ చేసి పాలతో తీసుకోవడం వలన పురుషుల లో శీఘ్రస్కలనం సమస్య తగ్గుతుంది.
అతిబలా ఆకులను కూరలా వండి రెండు పుతలా తింటూ ఉంటే మొలల నుండి కారే రక్తం ఆగిపొతుంది. అతిబలా వేరుని నిలువ చేసుకొని రోజు రెండు పూటలా కొంచం నీటితో సానరాయి పైన ఆ వేరుని అరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వాపు తగ్గిపొతుంది. అతిబలా వేర్లను దంచి పొడి చేసి జల్లించి నిలవచేసి , ఆ పొడిని మూడు, నాలుగు చిటికెల మొతాదుగా ఆవు నెయ్యితో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే గుండెకి బలం కలగడమే కాకుండా ముఖం కాంతి వంతంగా అవుతుంది.