అద్దె ఇళ్లలో ఉంటున్న గృహోపకరణాల వినియోగదారులకు ఇంధన శాఖ ఈ శుభవార్త అందించింది. ఇక నుంచి ఇల్లు మారినప్పటికీ గృహజ్యోతి ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. అయితే గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు నేటి నుంచి క్షేత్ర స్థాయిలో మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితో లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో ఇంటింటికీ కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది వచ్చి ఇంటి యజమానుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నంబర్లతో పాటు మొబైల్ నంబర్‌లను తీసుకోనున్నారు. అయితే ఈ ప్రక్రియ బుధవారం నుంచి జోరుగా సాగనుంది. గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అందజేయనుండగా.. దీనిని కేవలం ఇంటి ఓనర్స్ కు మాత్రమే అని ఫేక్ న్యూస్ వైరల్ అయింది. దీనిపై విద్యుత్ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
ఈ పథకాన్ని రెంట్ కు ఉంటున్న కుటుంబాలకు కూడా వర్తించనుందని తెలిపింది. ఇక ఈ విద్యుత్ లబ్ధి పొందాలనుకునే వారు ఇంటి వద్దకు వచ్చే మీటర్ రీడర్ (బిల్లు కొట్టే వారికి) మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డులను చూపించి.. సర్వీస్ నంబర్ కు అనుసంధానం చేయించుకోవాలని విద్యుత్ శాఖ పేర్కొంది. కరెంట్ బిల్లు కొట్టే వారు వచ్చిన సందర్భంలో ఇంట్లో ఎవరూ లేని పక్షలంలో ఒక తెల్ల కాగింతంపై కొన్ని వివరాలను రాసి మీటరు దగ్గర అంటించాలని తెలిపారు. దీంతో మీరు అందుబాటులో లేకున్నా ఆ వ్యక్తి మీ వివరాలను సర్వీస్ నంబర్ తో అనుసంధానించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.