ఈ చెట్టు కర్ర మీఇంట్లో ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా..?

ఇంట్లో ఆరె చెట్టు క‌ర్ర ఉంటే ఆ ఇంట్లో డ‌బ్బుకు లోటు ఉండ‌దు అని చాలా మంది న‌మ్ముతారు. మ‌నం ఇంటి వాస్తు దోషాల‌ను నివారించ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్రాలు చేస్తూ ఉంటాం. ఆరె కర్ర ఇంటి వాస్తు దోషాల‌ను నివారిస్తుందని చాలా మందికి తెలియ‌దు. ఆరె క‌ర్ర‌ను ఇంట్లో పూజ గ‌దిలో ఉంచి ధూప దీప నైవేధ్యాల‌తో పూజిస్తే ఎటువంటి వాస్తు దోష‌మైనా తొల‌గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరె చెట్టు గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు.

తెలుగు రాష్ట్రలలో అడవులలో ఈ చెట్టు విరివిగా పెరుగుతుంది.. మహరాష్ట్ర ప్రాంత వాసులకు మాత్రం ఈ చెట్టు సుపరిచితమే ఆరె చెట్టు ఆకులను వారు సోనా పత్తా అని పిలుస్తారు. అంటే బంగారు ఆకులు అని అర్థం.. దసరా పండుగ రోజు ఈ ఆకులు ఇచ్చి పుచ్చుకుంటే బంగారం ఇచ్చి పుచ్చుకున్నట్టుగా వారు అనుకుంటారు.. ఇలా చేస్తే మంచిదని వారు భావిస్తారు. ఆరె చెట్టు కర్ర ఇంటి వాస్తు దోషాలను, నరదిష్టిని పోగొడుతుంది.. ఆరె కర్ర ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో డబ్బులకు కొదవ ఉండదు. ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది.

ఆరె చెట్టు లో లక్ష్మిదేవి కొలువై ఉంటుందనీ ప్రతీతి.. కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి ఏమైనా వాస్తు దోషాలు ఉంటే.. ఆ ఇంటి పూజ మందిరంలో ఆరె కర్ర ఉంచి పూజిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా ఈ చెట్టు కర్రను పూజిస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. ఇంటికి నరదిష్టి, నేత్రదిష్టి తగలకుండా చేస్తుంది. ఆరె చెట్టు వేరును మెడలో ధరిస్తే దిష్టి తగలకుండా చేస్తుంది. గ్రహ దోషాలను తొలగిస్తుంది. ఈ వేరు ఉన్న తాయిత్తు మెడలో ఉంటే గ్రహ దోషాలు, నరదిష్టి తగలకుండా చేస్తుందని తాంత్రిక నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *