సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన కుప్పింట మొక్కను ఉపయోగించి మనం కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ మొక్క ఆకుల రసాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. అంతే కాకుండా ఈ మొక్క వేరుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. చిగుళ్లు గట్టి పడి చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది.
అయితే ఈ మొక్క ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శ్వాసకోస సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకు రసాన్ని తీసుకొని అందులో నిమ్మ రసాన్ని కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల గజ్జి, తామర వంటి వాటితో పాటు దురదలు దద్దుర్లు కూడా తగ్గుతాయి. ఆయుర్వేద నిపుణులు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కుప్పింట మొక్కను వాడుతున్నారు. ఈ మొక్క ఆకులను మెత్తగా చేసి అందులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
ముఖంపై ఉండే అవాంఛత రోమాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ మొక్క కనిపిస్తే తెచ్చి కాస్త మెత్తగా దంచి చర్మానికి అప్లై చేయండి. లేదంటే కాస్త కషాయం తయారు చేసుకొని తాగిన కూడా చాలా రకాల రోగాలు నయమవుతాయి. ఒకవేళ మీ అనారోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంటే కనుక ముందుగా డాక్టర్ నీ అయితే సంప్రదించి వారి సలహా మేరకే ఇటువంటివి వాడండి.