గడ్డిపూలు విచ్చుకోవడానికి కాస్త సూర్యరశ్మి కావాలి. చిన్నకాడ తుంచి నాటితే చాలు గబగబా ఎదిగిపోయి, చకచకా పువ్వులు పూసేస్తాయి. ఇవి నాటిన కొన్నాళ్ళకే పెద్ద పూలవనమైపోతుంది. శీతల ప్రాంతాల్లో అయితే ఎక్కువ పూలు విచ్చుకుంటాయి.అయితే టేబుల్ రోజా లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే , ఈ మొక్కను అసలు ఎవరు వదిలిపెట్టరు. ఈ మొక్క చర్మం మీద ఉండేటువంటి నల్లటి మచ్చలను, మొటిమలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ మొక్కలో వున్న పువ్వును కోసుకొని,
ఒక మెత్తని పేస్టులాగా చేసి, అందులోకి కొంచెం తేనెను కలిపి ముఖానికి పూసి, చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల, ముఖం చాలా అందంగా మెరుస్తుంది. దీనిని ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వలన తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఇక జుట్టు సమస్య ఎక్కువగా ఉండేవారికి ,ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కల కాండం, ఆకులను బాగా ముద్దగా నూరి, అందులోకి కొంచెం కొబ్బరి నూనె/ఆయుర్వేదం కలిగినటువంటి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించుకోవడం వలన జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది.
ఈ మొక్క యొక్క రసాన్ని ఏదైనా గాయాలు అయినప్పుడు పట్టించడం వలన, ఆ గాయం నుండి రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇక అంతే కాకుండా చర్మం పై వచ్చిన పొక్కులను (క్షయ వ్యాధి పొక్కులు) పోగొట్టుకోవడానికి, ఈ పూలను బాగా నూరి చర్మంమీద పట్టించడం వలన అవి తగ్గిపోతాయి. ఈ మొక్కల వేరుతో కషాయం చేసుకుని తాగడం వలన దగ్గు నుండి విముక్తి పొందవచ్చు. చూశారు కదా ఇకనైనా మీ ఇంటి వద్ద ఈ మొక్కలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.