ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, సంతోషాలు సర్వసాధారణం. కొందరు ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు చిన్న చిన్న సమస్యలకు కూడా మానసిక చిత్రవధలకు గురవుతారు. కానీ సుఖం, కష్టం మన చేతుల్లోనే ఉంటాయనేది అందరూ గ్రహించాల్సిన వాస్తవం. ఒత్తిడి పెరిగితే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఆనందాన్ని అందరూ కోరుకుంటారు, అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా మీరు మానసికంగా దృఢంగా, ప్రశాంతంగా ఉండాలి. తలనిండా ఆలోచనలు పెట్టుకుంటే ఏ పని సరిగ్గా చేయలేం, ఆ ఆలోచనలకు విరామం ఇచ్చి ఏకాగ్రత సాధించాలి.
ఇందుకోసం మెదడు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మెదడు కల్లోలంగా ఉంటే, ఏకాగ్రత సాధించలేము. మన వయసు పెరుగుతున్నట్లే మెదడు కూడా వృద్ధాప్యం ఎదుర్కొంటుంది, మెదడు చురుగ్గా, మీ నియంత్రణలో ఉండాలంటే మంచి ఆహారంతో పాటు కొంత వ్యాయామం కూడా అవసరం.