13మంది హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్, రోజుకో ట్విస్ట్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.

కొత్త కొత్త కోణాలు, పెను సంచలనాలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. దొరికిన ఏ ఒక్క ఆధారాన్ని వదలిపెట్టకుండా విచారణ కొనసాగిస్తున్నారు అధికారులు. అయితే లేటెస్ట్‌గా ఫోన్‌ ట్యాపింగ్‌పై అధికారికంగా కేసు నమోదవ్వడం.. దేశంలోనే టెలిగ్రాఫ్‌ యాక్ట్‌కు అటాచ్‌ చేసిన తొలి కేసు ఇదే అవ్వడంతో ట్యాపింగ్‌ వ్యవహారం మరింత సీరియస్‌ టర్న్‌ తీసుకుంది.

ఈ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం రియాక్ట్ అయ్యారు. నిందితులకు జైలులో చిప్ప కూడు తప్పదన్నారు. గత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు.ఇక కేసు దర్యాప్తులో ప్రణీత్‌రావుతో పాటు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ను జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు.

అయితే రాధాకిషన్‌కు 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకు ముందు రాధాకిషన్‌ను అదుపులోకి తీసుకున్న వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. కీలక విషయాలను రాబట్టి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. ప్రణీత్‌రావుతో ఉన్న సంబంధాలు? ఎంతకాలంగా ఫోన్ ట్యాపింగ్‌ చేశారు? ఏయే ప్రాంతాల్లో ట్యాపింగ్‌కి పాల్పడ్డారు? ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి పంపించారనే కోణంలో విచారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *