టేస్టీ తేజాకి గుండెపోటు..? షాక్ కలిగిస్తున్న వీడియో.

టేస్టీ తేజ బుల్లితెర, యూట్యూబ్ వ్యూవర్స్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన ఫుడ్ వీడియోలతో టేస్టీ తేజా బాగా పాపులర్ అయిపోయాడు. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా సందడి చేశాడు. ఇక అందులో శోభాశెట్టితో స్నేహం చేస్తూ.. బాగానే 10వారాలకు పైగానే ఉండాడు. ఇక బయటకు వచ్చాక టేస్టీ తేజ… తన ఫుడ్ వీడియోలతో బిజీగా మారిపోయాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, హీరోలు, హీరోయిన్లతో టేస్టీ తేజ ఫుడ్ వీడియోలు చేసుకుంటూ బీజీ అయిపోయాడు.

అయితే ప్రియాంక జైన్- శివకుమార్ లను కలిసేందుకు టేస్టీ తేజా వారి ఇంటికి వెళ్లాడు. ముందుగా ప్రియాంకతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత ప్రియాంకకు వంటలో హెల్ప్ చేస్తానని చెప్తాడు. రాగానే శివకుమార్ తేజాకి స్పెషల్ కర్బూజా జ్యూస్ తాగిస్తాడు. అది తాగిన తర్వాత తనకు ఏదో అనీజీగా ఉందని తేజా చెప్తాడు. అయినా వీళ్లు వంటగదిలో పనులు ప్రారంభిస్తారు. క్యారెట్లు కోస్తున్న సమయంలో తేజా తనకు బాలేదు అంటూ.. గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలతాడు.

తనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటూ చెప్తాడు. ప్రియాంక జైన్ ఎంతో కంగారు పడి పోతుంది. కానీ, శివకుమార్ మాత్రం ఎంతో రిలాక్స్డ్ గా ఉంటాడు. ఎందుకంటే టేస్టీ తేజాకి నిజంగానే హార్ట్ అటాక్ రాలేదు. ప్రియాంకను భయపెట్టేందుకు శివకుమార్ ఇలా తేజాతో కలిసి ప్రాంక్ ప్లాన్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *