నారా లోకేష్ తో కలిసి రాజకీయ పనుల్లో నిమగ్నమైన తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలి తిరిగిరాని లోకాలను వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తారకరత్న దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆయన మరణవార్త ప్రతి ఒక్కరినీ కలచి వేసింది.
వెండితెరకు తారకరత్నగా పరిచయమైన ఆయనకు మరో పేరు ఉంది. ఆయన అసలు పేరు ఓబులేసు. ఇంట్లోవాళ్లు ముద్దుగా ఓబు అని పిలుస్తారట. నందీశ్వరుడు సినిమా చిత్రీకరణ సమయంలో ఆ చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్ అలేఖ్య రెడ్డితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఆ తర్వాత ఇంట్లో వాళ్లను ఎదురించి స్నేహితుల సమక్షంలో అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు తారకరత్న. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడిప్పుడే డిజిటల్ ప్లాట్ ఫాంపై వరుస వెబ్ సిరీస్ చేస్తున్నారు.