ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ట్రాన్స్ జెండర్ అనేది లింగ గుర్తింపు మరియు వ్యక్తీకరణ పుట్టినప్పుడు వారికి కేటాయించిన లింగంతో సాంప్రదాయకంగా సంబంధం ఉన్న నిబంధనలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా లేని వ్యక్తులకు గొడుగు పదం. ఒక జీవ లింగం నుండి మరొక జీవ లింగానికి పరివర్తన చెందడానికి వైద్య సహాయం కోరుకుంటే వారిని ట్రాన్స్సెక్సువల్స్ అని పిలుస్తారు.
అయితే సమాజంలో వారు అంటే అందరికీ చిన్న చూపే.. వాళ్లు చిన్న చూపే అయినా.. దగ్గరకి వెళ్లడానికి ఇష్టపడరు. అయితే..వాళ్లకు మనసు ఉంటది. మాములు మనుషుల్లాగే బ్రతకాలని ఉంటుంది. కానీ, సమాజంలో జెండర్ వివక్ష వల్ల వాళ్లు బయటకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తెలంగాణ(లో తొలి ట్రాన్స్ జెండర్ కు ఫోటోగ్రఫీ కోసం లోను మంజూరు కాగా, మరో ట్రాన్స్ జెండర్కు ఫోర్ విల్లర్ డ్రైవింగ్ లైసెన్స్జారీ అయ్యింది. ఇందులో కనిపిస్తున్న ఈమే పేరు ఆశాఢం ఆశా. ఈమే ఒక ట్రాన్స్ జెండర్. మాములు మనుషుల్లాగే బ్రతకాలని ఈమేకు ఉంటుంది. అయితే.. ట్రాన్స్ జెండర్ ఇప్పటికీ సమాజంలో వివక్ష పోవడం లేదు. వీరికి ఉపాధి దొరకదు.