పలు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమోటా తోటలు దెబ్బ తిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి వల్ల దిగుబడి తగ్గింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి టమోటాల సరఫరా గణనీయంగా తగ్గింది. గతంతో పోలిస్తే రైతులు టమోటా సాగు తగ్గించారని తెలుస్తున్నది. అయితే టమాటాల ధరలు పెరగటంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు ప్రభుత్వం కూడా సబ్సీడి కింద టమాటాలు విక్రయిస్తుంది. ఇప్పటికి కొన్ని చోట్ల డబుల్ సెంచరీ క్రాస్ చేసి టమాటాల రేట్లు దూసుకుపోతున్నాయి. 2 రోజుల క్రితం మాట్లాడుకుంటే రాజ్‌కోట్ మార్కెట్ యార్డ్‌లో టమాటా ధర 3400 రూపాయలు ఉండగా.. ఈరోజు టమాటా ధర తగ్గింది. నేడు అదే టమాటా ధర రూ.2800 ఉండగా.. రాజ్‌కోట్ మార్కెట్ యార్డులో నేడు 998 క్వింటాళ్ల టమోటా వచ్చింది.
రాజ్‌కోట్ మార్కెటింగ్ యార్డులో రైతులకు తగిన ధరలు లభిస్తుండడంతో నిత్యం వేలాది మంది రైతులు తమ సరుకులను విక్రయించేందుకు వస్తున్నారు. ఉదయం నుంచే మార్కెటింగ్ యార్డు వెలుపల పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరుతున్నాయి. రైతులు తమ పంటలను విక్రయించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు.