తన అందానికి రహస్యం ఏంటో చెప్పిన మిల్కీబ్యూటీ తమన్నా.

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తిచేసుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉందీ బ్యూటీ. నటి తమన్నా ఇప్పుడు చాలా సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన సినిమాలు వరసగా విడుదలవుతున్నాయి. తమన్నా నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళంలో భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ లతో బిజీగా ఉన్న తమన్నా వయసు ప్రస్తుతం 33 ఏళ్లు.

దాదాపు 18 ఏళ్లుగా నటిగా సినీ ప్రియులను అలరిస్తుంది. ఇక రోజు రోజుకు తమన్నా అందం పెరుగుతూనే ఉందని. ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలో మరింత అందంగా కనిపించి మైమరపించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన అందానికి రహాస్యం చెప్పేశారు. ఈ గ్లామర్ ప్రపంచంలో ఫిట్ గా ఉండడం చాలా అవసరమని అన్నారు. అందుకు జిమ్ వర్కవుట్స్ చేయడమే కాకుండా ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు.

ఉదయం నట్స్, ఖర్జూరపండ్లు, అరటి పండ్లను సమానంగా తీసుకుంటానని.. మధ్యాహనం భోజనంలో బ్రౌన్ రైస్, పప్పు, కాయకూరలు తీసుకుంటానని అన్నారు. అదే విధంగా సాయంత్రం 5.30 వరకు డిన్నర్ ముగించేస్తాని.. ఆ తర్వాత మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తిననని అన్నారు. ఇలా 12 గంటలు ఏమి తినకుండా ఉంటానని.. దీంతో తన చర్మం కాంతులనుతుందని.. అంతేకాకుండా హెల్తీ, ఫిట్ గా ఉంటానని అన్నారు తమన్నా. అలాగే గ్రీన్ టీ, ఆమ్లా జ్యూస్ వంటివి తన ఆరోగ్య రహస్యంలో ఒక భాగమంటూ చెప్పుకొచ్చారు మిల్కీబ్యూటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *